ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం తాగాలంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి

national |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 05:16 PM

ఏం మాట్లాడినా, ఆచి తూచి మాట్లాడాలని పెద్దలు చెబుతుంటారు. అయితే అనవసర వ్యాఖ్యలు చేసి లేని పోని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు కొందరు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మంత్రి విద్యాశాఖ మంత్రి ప్రేమ్‌సాయి సింగ్‌ టెకమ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఏకం చేసే శక్తి మద్యానికి ఉందని, అయితే కొద్దిగా తాగాలని మంత్రి సలహా ఇచ్చారు. వద్రాఫ్‌నగర్‌లో ఇటీవల జరిగిన డి-అడిక్షన్‌ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో పిల్లలు కూడా పాల్గొన్నారు. దీంతో పిల్లలకు మంత్రి ఇచ్చే సలహా ఇదేనా అంటూ నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com