హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడైన బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. గుర్గావ్లోని ఓ క్లాత్ షోరూమ్‌లో ఉన్న బీజేపీ నేత సుఖ్బీర్ ఖతానాను దుండగులు గురువారం తుపాకీతో కాల్చి చంపారు. ఐదుగురు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడకు చేరుకుని ఖతానాను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు