ఆంధ్రప్రదేశ్ లో మద్యం వినియోగం తగ్గిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2018-19 సంవత్సరంలో 2.77 కోట్ల బీర్లు అమ్మితే 2021-22లో 82 లక్షలు మాత్రమే అమ్ముడయ్యాయని జగన్ అన్నారు. 2018-19లో మద్యం ద్వారా రూ.20,128 కోట్ల ఆదాయం వచ్చిందని, 2021-22లో రూ.25,023 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మద్యం ధర పెరగడంతో వినియోగం తగ్గింది అని తెలిపారు.