టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ యూఎస్ ఓపెన్ ఆడుతుండగా గాయపడ్డాడు. షాట్ కొడుతుండగా తన రాకెట్ ముక్కుకు బలంగా తాకింది. దీంతో నాదల్ బాధతో విలవిల్లాడిపోయాడు. ముక్కు నుంచి రక్తం కూడా వచ్చింది. యూఎస్ ఓపెన్ రెండో రౌండ్ లో ఇటలీ ప్లేయర్ ఫాబియో ఫోగ్నినితో ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక చికిత్స అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని నాదల్ గేమ్ ను కొనసాగించాడు. ఫోగ్నినిపై 2-6, 6-4, 6-2, 6-1 తేడాతో విజయం సాధించి నాదల్ మూడో రౌండ్ కు దూసుకెళ్లాడు.