తన కుమార్తె స్నేహాల్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మృతి చెందిందని దిలీప్ లునావత్ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఆమె వ్యాక్సిన్ వల్ల చనిపోయిందని వ్యాక్సిన్ అనంతర దుష్ప్రభావాల కమిటీ(ఏఈఎఫ్ఐ) నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా కోర్టులో దిలీప్ శుక్రవారం పిటిషన్ వేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీరం ఇనిస్టిట్యూట్, బిల్గేట్స్ల నుంచి రూ.1000 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరాడు.