ఏపీలో త్వరలో 'ఆంధ్ర గోపుష్టి' కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా స్వచ్ఛమైన, రసాయనాలు లేని పాలు, పనీర్, నెయ్యి, వెన్న వంటి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ నెల చివరిలో విజయవాడ నగరంలో తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. తర్వాత వరుసగా మిగిలిన నగరాలలోనూ 'ఆంధ్ర గోపుష్టి' కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.
'ఆంధ్ర గో పుష్టి' పేరుతో పాలు, వెన్న, నెయ్యి, చీజ్ వంటి పలు ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరులో విజయవాడలో తొలి కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు.