ఆసియా కప్ మెగా టోర్నీలో నేటి నుంచి సూపర్ 4 దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్ తలపడనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. IST రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4కు చేరుకోగా.. బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు టోర్నీ నుంచి వైదొలిగాయి. ఆసియా కప్ టోర్నీలో శ్రీలంకకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటికి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ కప్‌ను భారత్ ఏడుసార్లు గెలుచుకుంది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ ఆడడం ఇది మూడోసారి. అయితే లంకేయులు తమ తొలి మ్యాచ్‌లోనే ఆఫ్ఘన్ చేతిలో చిత్తుగా ఓడారు. ఇప్పుడు సూపర్ 4 దశలో ఈ రెండు జట్లు మరోసారి తలపడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్‌పై లంక ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక ఓటమి చవిచూస్తుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.
సూపర్ 4 షెడ్యూల్:
సెప్టెంబర్ 3 రాత్రి 7.30కు ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ శ్రీలంక, షార్జా క్రికెట్ స్టేడియం (శనివారం)
సెప్టెంబర్ 4 రాత్రి 7.30కు ఇండియా వర్సెస్ పాకిస్థాన్, దుబాయ్ స్టేడియం (ఆదివారం)
సెప్టెంబర్ 6 రాత్రి 7.30కు ఇండియా వర్సెస్ శ్రీలంక, దుబాయ్ స్టేడియం (మంగళవారం)
సెప్టెంబర్ 7 రాత్రి 7.30కు పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్, దుబాయ్ స్టేడియం (బుధవారం)
సెప్టెంబర్ 8 రాత్రి 7.30కు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్, దుబాయ్ స్టేడియం (గురువారం)
సెప్టెంబర్ 9 రాత్రి 7.30కు శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్, దుబాయ్ స్టేడియం (శుక్రవారం )
సెప్టెంబర్ 11 రాత్రి 7.30కు ఫైనల్ మ్యాచ్ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య (ఆదివారం)