మణిపూర్‌లో జేడీయూకు ఆరుగులు ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఐదుగురు శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌కు వారు లేఖ ఇచ్చారు. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ ఏకైక జేడీయూ ఎమ్మెల్యే ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో బీహార్‌లో బీజేపీతో కటీఫ్ చెప్పిన జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్‌కు ఇది ఊహించని పరిణామమనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.