వాట్సాప్ గ్రూపులపై అడ్మిన్‌లు మరింత పట్టు సాధించే ఫీచర్ ను ఆ సంస్థ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. గతంలో వాట్సాప్ గ్రూపులో సభ్యులు ఏదైనా మెసేజ్ డిలీట్ చేసే ఆప్షన్ కేవలం సదరు యూజర్‌కు మాత్రమే ఉండేది. కొత్తగా వచ్చిన ఫీచర్ ద్వారా ఇకపై గ్రూపు సభ్యుల అభ్యంతరకర మెసేజ్‌లను గ్రూపు అడ్మిన్‌లు డిలీట్ చేయొచ్చు. దీనివల్ల అభ్యంతరకరమైన, నకిలీ వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్ భావిస్తోంది.