గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో నిర్వహించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నవరత్నాలు అర్హులైన వారికి అంతుతున్నాయో లేదో ప్రజల నుంచి ఆరా తీశారు. పథకాలు అందని వారు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. గడిచిన మూడేళ్ళ లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్దిని ప్రజలకు వివరించి బుక్లెట్లను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.