చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరులో శుక్రవారం అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పలమనేరు పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన శ్రీనివాసులుని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఇంటి వద్ద కర్ణాటక మద్యం విక్రయిస్తుంటే పట్టుకున్నారు. 25 మద్యం ప్యాకెట్లతో పాటు నిందితుడిని కోర్టుకు అప్పగించారు.