టీటీడీలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన తిరుమలలో లడ్డూ కౌంటర్లు నిర్వహిస్తున్న కేవీఎం ఇన్ఫోకామ్కు చెందిన ముగ్గురు ఉద్యోగులపై టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా కొత్తపేటకు చెందిన జి.బబ్లూ అనే యువకుడి ఫిర్యాదు మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కేవీఎం ఇన్ఫోకామ్లో రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కేవీఎం ఇన్ఫోకామ్ మేనేజర్ గణేష్, కో-ఆర్డినేటర్ చందు, లడ్డూ కౌంటర్ బాయ్ మేకల సురేష్ నిరుద్యోగ యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బబ్లూ అనే యువకుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితులపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.