విజయవాడలో తెలుగుదేశం నేత చెన్నుపాటి గాంధీపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు.పాతమలంకలోని బాలికల ఉన్నత పాఠశాలలో గాంధీని వైకాపా గూండాలు కొట్టారు. కంటికి తీవ్ర గాయాలు కావడంతో తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. వైకాపా వర్గీయులు, దేవినేని అవినాష్ మనుషులే దాడి చేశారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చెన్నుపాటి గాంధీ భార్య తొమ్మిదో డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు.