ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పాతమలంకలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ రౌడీల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడించారు.దాడి కారణంగా గాంధీచూపునకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిసి ఆవేదనకు గురయ్యానని చంద్రబాబు పేర్కొన్నారు. గాంధీకి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు.