తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు కుప్పకూలిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పెనుమూరులో చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రత్నం నాయుడు అనే రైతు రెవెన్యూ అధికారులతో మాట్లాడుతుండగానే మరణించాడు. ప్రభుత్వం రత్నం నాయుడికి లీజు కింద రెండు ఎకరాల భూమి ఇవ్వగా దానిని గ్రామస్తులు ఆక్రమించుకున్నారు. మిగిలిన భూమికి హక్కు పత్రాన్నివ్వాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.