అరటిపండులో ప్రొటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6, సి వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అరటిపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె, ఒక కప్పు పెరుగు మరియు 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు రాయండి.అరగంట అలాగే ఉంచి మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ చుండ్రును తొలగిస్తుంది.