రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ అందించింది. కౌంటర్ వద్ద తీసుకున్న రిజర్వేషన్ టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకుని, రీఫండ్ పొందే సౌలభ్యం కల్పించింది. ఇప్పటి వరకు ఈ విధానం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారికే అందుబాటులో ఉండేది. చాలా మంది రీఫండ్ పొందలేకపోతున్నారనే సమస్యకు తాజాగా ఐఆర్‌సీటీసీ పరిష్కారం చూపింది. దీంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి లబ్ధి చేకూరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa