రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బీజేపీ నాయకుడిని దుండగులు కాల్చి చంపారు. బీజేపీ నేత కిర్పాల్ సింగ్ తన కారులో ఆదివారం రాత్రి సర్క్యూట్ హౌస్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు బైక్‌లు, కార్లపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. వారి కాల్పుల్లో కిర్పాల్ మృతి చెందాడని పేర్కొన్నారు. భరత్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎంపీ రంజీతా కోలికి కిర్పాల్ సన్నిహితుడు.