విశాఖపట్నం ఎయిర్పోర్టును తరలించేందుకు నేవీ ఓకే చెప్పడంతో భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మించాలని ఏపీ సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు ఢిల్లీ నౌకాదళం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంవోయూపై సంతకం చేశారు. భోగాపురంలో సేకరించిన భూములపై నమోదైన కేసులపై త్వరలోనే తీర్పు రానుంది. ఆ వెంటనే ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.