ఏపీలోని చిత్తూరు జిల్లా నగరిలో దారుణం జరిగింది. ఇందిరానగర్‌లో ఉండే విజయ్, వనిత భార్యాభర్తలు. వనితతో విజయ్ స్నేహితుడు తమిళ అరసుకు ఎఫైర్ ఏర్పడింది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా ఓ సారి విజయ్ కంటబడ్డారు. తమ ఎఫైర్ కొనసాగాలంటే విజయ్ చంపేయాలని ఇద్దరూ భావించారు. పక్కా ప్లాన్‌తో ఆగస్టు 29న విజయ్ను హత్య చేసి, ప్రమాదవశాత్తూ మరణించినట్లు నమ్మించారు. వనిత పోలీసులకు లొంగిపోవడంతో నిందితులంతా అరెస్ట్ అయ్యారు.