ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో మిథిలేష్ అనే వ్యక్తి తన తల్లి క్షితిజ్ను మూడు రోజుల క్రితం హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని బాత్రూమ్లో పెట్టి గడియపెట్టాడు. ఆదివారం మిథిలేష్ కత్తితో పీక కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.