బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతా దళ్(యునైటెడ్) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. మొన్నటిదాకా బీజేపీతో జత కట్టి బీహార్‌లో ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్... ఇటీవలే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నితీశ్ కుమార్... రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఎల్లుండి (సెప్టెంబర్ 7) నుంచి భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు ముందు రాహుల్‌తో నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ సుదీర్ఘ పాదయాత్రపైనా చర్చ జరిగినట్లు సమాచారం.