ఢిల్లీ లిక్కర్ స్కాం పై మాజీ మంత్రి కోల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి దేశమంతా భారతీ రెడ్డి విజయసాయిరెడ్డిల పాత్రల గురించే మాట్లాడకుంటోందని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఈ స్కాంపై సమాధానం చెప్పుకోలేని సీఎం జగన్ చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఎదురుదాడి చేయించటం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.