తమిళనాడు సేలంలో ఓ సినీ దర్శకుడు కటకటాలపాలయ్యాడు. వేల్ క్షత్రియన్ అనే వ్యక్తికి యాక్టింగ్ స్కూల్ ఉంది. సినీ ఛాన్స్‌లు ఇప్పిస్తానని 300ల మందికి పైగా యువతులను అతడు మోసగించాడు. అసిస్టెంట్ జయజ్యోతితో కలిసి రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టాడు. వాటి ద్వారా యువతుల నగ్న చిత్రాలు సేకరించి వేధించేవాడు. ఓ యువతి పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేయడంతో నిందితుడు అరెస్ట్ అయ్యాడు.