జింబాబ్వేను మీజిల్స్ (తట్టు) వ్యాధి వణికిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి 700ల మంది చిన్నారులు చనిపోయారు. సెప్టెంబర్ 1వ తేదీన ఒక్కరోజులోనే 37 మంది చిన్నారులు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ పేర్కొంది. పోషకాహార లోపం ఉండి, వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి వచ్చిన పిల్లలలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వస్తాయి.