యూకేలోని నార్త్ హార్క్‌షైర్‌కు చెందిన ఓ దంపతులను ఇటీవల అదృష్టం వరించింది. తమ ఇంటిలో కిచెన్‌ను కూల్చేసి కొత్తది కట్టాలని భావించారు. గోడను కూల్చగా అందులో 400 ఏళ్ల నాటి 264 బంగారు నాణేలు బయటపడ్డాయి. దీంతో ఆ దంపతులు ఎగిరి గంతేశారు. వాటిని ప్రముఖ వేలంపాట నిర్వహణ సంస్థ 'స్పింక్ & సన్'కు అప్పగించారు. వేలం ద్వారా వారికి రూ.2.3 కోట్లు రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.