కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని కొట్రగుట్టు సమీపంలోని అంబలమొగరుకు చెందిన రష్మీ ఆచార్య (24)కు, గంజిమఠానికి చెందిన సందీప్‌తో ఆగస్టు 21న వివాహమైంది. సెప్టెంబర్ 3న ఆమె సోదరి ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రష్మీ ఎలుకల మందు తినేసింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. దీంతో పెళ్లింట్లో విషాదం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa