పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) G. బిందు మాధవ్ ఐపీఎస్ ఫిర్యాదులు స్వీకరించినారు.
సోమవారం స్పందనా కార్యక్రమానికి ప్రజల నుండి 77 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిష్కరించవలసినదిగా సంబంధిత డీఎస్పీలను ఆదేశించామని అదనపు ఎస్పీగారు తెలిపారు. ప్రజలు ఈ విన్నూతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.