ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాలకి సంభంధం లేని వారిని లాగడం న్యాయమా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 01:04 PM

గత రెండు రోజుల క్రితం వైసీపీ నాయకురాలు పోతుల సునీత మాట్లాడుతూ... చంద్రబాబు హయం లో నారా భువనేశ్వరి, అలానే నారా బ్రాహ్మణి ఇద్దరు కలిసి మద్యం వ్యాపారం చేసేవారని, అసలు మద్యం క్రొత్త బ్రాండ్లను తెరిచిందే ఈ ఇద్దరు ఆడవారు అని వాపోయారు. 


దీనితో రాష్ట్రము లోని తెలుగు దేశం నాయకులూ స్పందిస్తూ... రాజకీయాలు రెండు పార్టీల మధ్య ఉండాలి కానీ , ఇండ్లలో ఉన్న ఆడవారిని కూడా వీటిలోకి లాగడం నీచమైన చర్య అని బదులిచ్చారు. 


అలానే మరి కొందరు నాయకులూ ఐతే, ఎవరు మద్యం వ్యాపారం చేస్తున్నారో, వారి వెనక ఎవరు ఉన్నారో అందరికి తెలుసు అని అంటూ... ఈ మధ్య విజయసాయి రెడ్డి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ, వై.ఎస్.భారతమ్మకు కృతజ్ఞతలు చెబితే, సంబంధం ఏమిటా అనుకున్నారు ప్రజలు. అది ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో 


బయటపడింది. మేడం దీవెనలతో జె-బ్రాండ్ వ్యాపారంలో ఇద్దరు అల్లుళ్లను పెట్టి బాగా దండుకుంటున్నాడు విజయసాయిరెడ్డి అని వాపోతున్నారు. 


మరి ఎవరి వాదన నిజమో అంతుపట్టని ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా రాజకీయాల కోసం , ఆడవారిని కూడా బాగస్తులుగా మాట్లాడటం మంచి పద్దతి కాదేమో అని కొంతమంది ప్రజలు వాపోతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com