రాష్ట్రానికి జీవనాడిలాంటి జలవనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ సిఎం జగన్ కి, టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో ... టిడిపి పాలనలో 68,293 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టుల పనులు చేపట్టాం. తాగునీటికి కటకటలాడే రాయలసీమకి సాగునీరు అందించాం. వైసిపి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేదు.
మీరు నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రాజెక్టుల పూర్తి అగమ్యగోచరంగా తయారైంది. మా పాలనలో పూర్తయి, మిగిలిన చిన్న పనులు చేస్తే ప్రారంభించాల్సిన నెల్లూరు, సంగం బ్యారేజీలని ఇప్పటివరకూ ప్రారంభించకుండా తాత్సారం చేశారు.
కొత్త ప్రాజెక్టులు ఎలాగూ కట్టలేరు, కనీసం ఉన్న ప్రాజెక్టుల మరమ్మత్తులు చేయించలేని నిస్సహాయ ప్రభుత్వంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. కమీషన్లు పిండుకోవడం ఆపి, జలవనరుల ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని పొందుపరిచినట్లు తెలిపారు.