శ్రీకాకుళం, పాతపట్నం: హిరమండలం వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని ఏడు రోజుల నుంచి పూజలం దుకున్న గణనాథుల ప్రతిమలను మంగళవారం ఊరే గింపుగా తీసుకువెళ్లి వంశధార కుడి ప్రధాన కాలువ, గొట్టా బ్యారేజీలో నిమజ్జనం చేశారు. హిరమండలం మేజర్పంచాయతీలో చిన్నకోరాడ, పెద్దకోరాడ, అంధవరపు వీధి, గాంధీనగర్ వీధులలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను ఆయా ప్రాంతాల వారు ట్రాక్టర్లపై ఊరేగించారు. జై గణేశా అంటూ నినాదాలు చేస్తూ వంశధార కుడి ప్రధాన కాలువలో నిమజ్జనం చేశారు. అలాగే మండల వ్యాప్తంగానూ గణనాథుని నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.