శ్రీకాకుళం, రాజాం: పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులు పేర్కొన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అయ్యేలా ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శంకర్రావు ఎం. ఈ. ఓ. దుర్గారావు ఆదేశించారు. సోమవారం వంగర మండల కేంద్రం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకము ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
విద్యార్థులకు గుడ్లు, రసం, సాంబారు మిగతా వంటలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో నుంచి మెనూ విషయంలో ఫిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుని ఏజెన్సీలను తొలగించడం జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.