గుంటూరు, తాడికొండ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడి మాజీ ఎస్ఐ మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గుంటూరు పట్టణం వెంకటప్పయ్య కాలనీకు చెందిన ఏటుకూరి హృదయ రాజు గతంలో ఎస్సైగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా. మేడికొండూరు మండలంలోని తులసి సీడ్స్ కంపెనీ వద్దకు రాగానే ఒక్కసారిగా బైక్ అదుపు తప్పడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.