గుంటూరు, గురజాల: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని గురజాల 10వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి. వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక కోర్టు భవనాల సముదాయంలో గురజాల, పిడుగురాళ్ల మండలాల పారా లీగల్ వలంటీర్లుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా చట్టాలు, పోక్సో చట్టం గురించి అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ చట్టాల గురించి అవగాహన కల్పించారు.