గుంటూరు, వినుకొండ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని గతంలో వినుకొండ శాఖలో 2. 70 కోట్ల రూపాయల సొమ్ము స్వాహా చేశారు. సొమ్ము పక్కదారి పట్టిన విషయాన్ని నిర్ధారించి నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్న అక్రమార్కుల పై చర్యలు తీసుకోవడంలో అంతులేని జాప్యం జరుగుతుంది. వినుకొండ శాఖ పరిధిలోని ఎనిమిది సొసైటీలో 70 లక్షల సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది లబ్ది పొందారు. కొందరు నేతలు అక్రమార్కులకు అండగా నిలవడంతో అక్రమాలు రిపీట్ అవుతున్నాయి.