మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి అన్నారు. ఐద్వా 5వ మహాసభ తాడేపల్లి పట్టణంలోని గౌడ సంఘం ఫంక్షన్ హాల్లో మంగళవారం గిరిజ అధ్యక్షతన జరిగింది. సభలో రమాదేవి మాట్లాడుతూ పేదల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని కోటీశ్వరల ఆస్తులు రెట్టింపు అవుతున్నాయన్నారు. కరోనా అనంతరం ఉపాధి లేక పేదల ఆదాయాలు గణనీయంగా తగ్గాయన్నారు.
హత్యలు, అత్యాచారాలు చేసిన నేరస్తులను మోడీ ప్రభుత్వం ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేయటం సిగ్గు చేటు అన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు దేశంలో మత ఉదృక్తితలు రెచ్చగొట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూందని అన్నారు. ప్రజలు సామరస్యంగా, ఐక్యంగా ఉండాలని సూచించారు. దశలవారీగా మద్య నిషేధం విధిస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా మద్యాన్ని ఏరులై పారిస్తుందని, మద్య నిషేధం ఎక్కుడా అని ప్రశ్నించారు. తొలుత ఐద్వా పతాకాన్ని రాష్ట్ర నాయకురాలు దొంతిరెడ్డి శ్రీనివాసకుమారి ఆవిష్కరించారు.