మహిళలకు దిశ యాప్ ఒక రక్షణ కవచం లాంటిదని ఆ యాప్ ప్రతి ఇంట్లో మహిళల ఫోన్లో డౌన్ లోడ్ చేసుకునే విధంగా వాలంటీర్లు కృషి చేయాలని గూడూరు పట్టణ సీఐ హాజరత్ బాబు సూచించారు. మంగళవారం గూడూరు పట్టణంలోని 12వ సచివాలయ పరిధి క్లస్టర్ వాలంటీర్లకు దిశ యాప్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ హాజరత్ బాబు, పట్టణ ఎస్ఐ పవన్ కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలు, విద్యార్ధినుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు రూపొందించిన దిశ యాప్ తో వారిని వారే ఆత్మ రక్షణ చేసేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. దిశ యాప్ అందరి ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రభుత్వం మెగా డ్రైవ్ చేపట్టిందన్నారు. అందులో భాగంగా ప్రతి వాలంటీర్ మహిళా పోలీస్ సహకారంతో తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి మహిళలకు దిశ యాప్ ప్రాధాన్యతను వివరించి వారి మొబైల్ ఫోన్లలో దిశ యాప్ ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ మహిళా పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.