ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 05:17 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో చోటుచేసుకున్న దారుణంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్ పోసిన నిందితుడు ఆపై గొంతు కోసిన చర్య పరమ దుర్మార్గమని ఇలాంటి ఘటనల్ని అందరూ ఖండించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.

మంగళగిరిలోని కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బాధితురాలిని సకాలంలోనే జిల్లా కలెక్టర్ నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్స అందించారని, అక్కడ వైద్యుల సూచనమేరకు మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను చెన్నై అపోలో కి తరలించినట్లు వివరించారు.

బాధితురాలు త్వరగా కోలుకోవాలని, ఆమె వైద్యానికయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో నిందితుడికి కఠినశిక్ష పడేలా, బాధిత కుటుంబానికి మహిళా కమిషన్ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని వాసిరెడ్డి పద్మ హామీనిచ్చారు. మీడియా సమావేశంలో ఆమెతో పాటు మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి, బూసి వినీత ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com