శింగనమల ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ నాయకురాలు ఉండవల్లి అనూష అన్నట్లుగా వార్ కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మహిళా నేత, అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వైనంపై శింగనమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏలూరు జిల్లాకు చెందిన టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనూషను నిందితురాలిగా చేరుస్తూ శింగనమల పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలపై 3 రోజుల్లోగా సంజాయషీ ఇవ్వాలంటూ ఉండవల్లి అనూషకు ఏలూరులోని ఆమె ఇంటి వద్దే శింగనమనల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో భీమిశెట్టి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఉండవల్లి అనూషపై పోలీసులు కేసు నమోదు చేశారు.