వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళతో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ ప్రచారంలోకి వచ్చిన వీడియో వ్యవహారంలో మంగళవారంనాడు ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వీడియో వ్యవహారంపై గోరంట్ల మాధవ్ ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సదరు వీడియోలో ఉన్నది తాను కాదంటూ గోరంట్ల మాధవ్ చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా తనపై కక్షతోనే ఈ వీడియోను మార్ఫింగ్ చేశారని, ఈ కుట్రకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గోరంట్ల మాధవ్ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోను ఐటీడీపీ ముందుగా ప్రచారంలోకి తెచ్చిందని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గోరంట్ల మాధవ్ ఫిర్యాదు ఆధారంగానే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.