రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేయాలని నగరకమిషనర్ అరుణ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం నాగయ్యకళాక్షేత్రంలో వార్డు అడ్మిన్, వెల్ఫేర్, అమినిటీ కార్యదర్శులు, మెప్మా సీఓతో ప్రత్యేక సమీక్షసమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికీ ఇల్లుకార్యక్రమంలో భాగంగా జగనన్నహౌసింగ్ కాలనీ పై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు.