శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈసారి సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయించింది. తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.