అన్నమయ్య జిల్లాలోని వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, దివ్యాంగులు, షెడ్యూలు కులాలకు చెందిన విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కోసం దరఖాస్తు చేసుకోవాలనిజిల్లా షెడ్యూలు సంక్షేమ సాధికారిక అధికారి జాకీర్ హుస్సేన్ మంగళవారం పేర్కొన్నారు. కళాశాల యజమానాలు జ్ఞానభూమి పోర్టల్లో అర్హుల వివరాలు నమోదు చేయాలన్నారు. కళాశాల లాగిన్ సంబంధించిన దరఖాస్తులను అప్లోడ్ చేయాలన్నారు. ఈనెల 30వ తేదీ చివరి గడువుగా అని పేర్కొన్నారు.