కేంద్రంలో భాజపా విధ్వంస పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన మహా పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ పిలుపునిచ్చారు. మంగళవారం రాయచోటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో సుమారు 100 కి. మీ. ల మేర పాదయాత్ర జరగనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నిరంకుశ పాలనలో రైతుల ఆత్మ హత్యలు పెరిగాయన్నారు. కార్యక్రమంలో నాయకులు దర్బార్ షా, యహియాబాషా, విక్టోరియా పాల్గొన్నారు.