పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని నగిరిగుట్లలో ఉంటున్న వైసిపి కార్యకర్త ఖాసింవలికి మంగళవారం ఆ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు రూ. 44వేలు అందజేశారు. ఖాసింవలి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న కొంతమంది వైసిపి నాయకులు, కౌన్సిలర్లు ఆర్థికసాయాన్ని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్, సివిల్ సప్లయ్ డైరెక్టర్ హాల్ గంగాధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ హఫీజ్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అంద జేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పార్నపల్లి కిషోర్, నాయకులు సిద్దయ్య పాల్గొన్నారు.