శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వరదరాజస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ఎట్టకేలకు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం పట్టణ వీధుల కంటే తక్కువ లో ఉన్న ఆలయాన్ని ఎత్తు పెంచడంతోపాటు అభివృద్ధి చేపట్టాలని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ధర్మకర్తల మండలి నిర్ణయించింది. పనుల ప్రారంభ దృష్ట్యా మార్చి 25 వ తేదీన బాలల ఆలయాన్ని మూసివేశారు. ప్రస్తుతం పనులు ప్రారంభమయ్యాయి.