అమెరికాలోని లూసియానా ప్రాంతానికి చెందిన డారెన్ అనే వ్యక్తి ఖాతాలో ఇటీవల రూ.4 లక్షల కోట్లు జమ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా అతడు ప్రపంచ కుబేరుల జాబితాలో 25వ స్థానానికి చేరుకున్నాడు. అయితే తనకు అంత డబ్బు ఎలా వచ్చిందని ఆలోచింని డారెన్ నేరుగా బ్యాంకుకు ఫోన్ చేశాడు. దీంతో బ్యాంకు సిబ్బంది డబ్బు వెనక్కి తీసుకుని, ఖాతాను స్తంభింపజేశారు. ఫలితంగా కొన్ని గంటలు మాత్రమే అతడు బిలియనీర్‌గా ఉన్నాడు.