మంగళవారం , నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్ ని సీఎం జగన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలెట్టినప్పటికీ , పూర్తి అయ్యే సరికి ఎప్పటి వరకు పట్టింది. ఐతే మధ్యలో నారా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి చేసి, ఈ ప్రాజెక్ట్ పనులు కొంత మేర చేసారు అనడంలో సందేహం లేదు.
ఐతే, మాజీ నీటిపారుదల శాఖామంత్రి, టీడీపీ నాయకులూ దేవినేని ఉమా మాట్లాడుతూ... సంగం బ్యారేజ్ పనులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 82% పైగా పూర్తిచేస్తే.. 40నెలల్లో 10శాతం పనులు కూడా పూర్తి చేయకుండా వైసీపీ నాయకులూ రిబ్బన్ కటింగ్ చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణను భ్రష్టు పట్టించారు. సంగం పేరు మార్చడం తప్ప ఏం చేశారు? ఎవరి హయాంలో ఎంత ఖర్చుపెట్టారో చెప్పే ధైర్యంఉందా? అని ప్రశ్నించారు.