ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని అవినాష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 01:39 PM

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాలను కరపత్రాల రూపంలో అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకవైపు గత ప్రభుత్వం చేసిన బకాయిలు చెల్లించుకుంటు మరోవైపు ఎవరికి ఎలాంటి లోటు లేకుండా మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాలు అమలు చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత వలనే సాధ్యం అయ్యింది అని కొనియాడారు.


గతంలో ఎవరికైనా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి లంచాలు ఇస్తే గాని అయ్యే పరిస్థితి లేదని, సొంత పార్టీ కార్యకర్తల దగ్గరే లంచాలు వసూలు చేసిన ఘనత టీడీపీ వారిది అని ఎద్దేవా చేశారు. టిడ్కొ పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేసింది ఎవరో అందరికి తెలుసని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com