ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెం గ్రామానికి చెందిన నంబూరు సుబ్బారావు, ఆళా వీరాంజనేయులు కలిసి గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో గొర్రెలు ఫిరంగిపురం ఆరోగ్య నగర్ వద్ద రైలు పట్టాలు దాటుతుండగా పల్నాడు జిల్లా నుంచి గుంటూరు వెళ్తున్న గూడ్సు రైలు వాటిని ఢీ కొట్టింది. ఘటనలో మొత్తం 35 గొర్రెలు ఉండగా వాటిలో 25 అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 10 గొర్రెలకు గాయాలయ్యాయి.